కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు…

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు…

  • కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు
  • బీఆర్ఎస్ పార్టీ నాయకులు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ ; కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గట్టి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.భీమ్‌గల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దొనకంటి నర్సయ్య మాట్లాడారు.గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు.

ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 21 పంపు హౌజ్ లు,19 సబ్ స్టేషన్ లు, 203 కి. మీ. సొరంగాలు, 98 కి.మీ. ప్రెజర్ మెన్స్, 1531కి.మీ.గ్రావిటీ కెనాల్స్.
వేల కి. మీ పిల్లకాలువలు, విజయవంతంగా కెసిఆర్ నిర్మించారని గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే ఎస్సారెస్పీ పునరుజీవం(కాళేశ్వరం రివర్స్ పంపింగ్) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు.ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు.

భీమ్‌గల్ మండలం లోని కప్పల వాగులు మే నెలలో కూడా రివర్స్ పంపింగ్ ద్వారా వాగులను నింపిన ఘనత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కి దక్కుతుంది.ఈ కప్పల వాగులో కాలేశ్వరం నుండి వచ్చిన నీళ్లు నిలువ ఉండడం వల్ల ఈరోజు భీమ్‌గల్ పట్టణంలో త్రాగునీటికి మరియు సాగునీటికి కొదువ లేకుండా ఉన్నది.కేవలం కేసీఆర్ ని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయి నప్పటికీ,వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.

రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. పిసీ ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతి స్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి చౌటుపల్లి రవి, మాజీ రైతు బంధు అధ్యక్షులు శర్మ నాయక్, మాజీ జిల్లా కో-ఆప్షన్ మొయిజ్, మాణిక్యాల శ్రీనివాస్, మూడేడ్ల ప్రకాష్, కౌన్సిలర్ల అనుప్రమ (ప్రసాద్,) బోదిరే నర్సయ్య, గున్నాల భగత్,నీలం రవి, నాయకులు తోట శంకర్, సతీష్ గౌడ్,పర్స నవీన్,ఎం ఏ.సుర్జిల్, బచ్చగొని శ్రీనివాస్, రాజు నాయక్,డిష్ గంగాధర్, లింగం నాయక్, మూత లింబాద్రి, ఎస్పీ ప్రవీణ్, సిద్ధపల్లి రాములు, రాగుల అశోక్, మల్లెల శ్రీకాంత్,తోగిటి అరుణ్,గట్టు రతన్ రాజ్, కైత సాగర్,బోట్ల రామకృష్ణ, రాజేష్(లడ్డు నేత,)పత్రి దశరథ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply