Meeting | రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

Meeting | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆమె భాజపా నేతలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని ప్రీతిరెడ్డి కలిశారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని మల్లారెడ్డి కలిసిన విషయం తెలిసిందే.
తాజాగా బీజేపీ కార్యాలయానికి ప్రీతిరెడ్డి వెళ్లడం మరింత చర్చకు దారితీసింది. రెండు రోజుల క్రితం కూడా ఆమె రామచందర్రావుతో భేటీ అయినట్లు సమాచారం. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు కారణమవుతున్నాయి.
