అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ దాడి

అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ దాడి

  • ప్రభుత్వ భూముల కబ్జాలకు చెక్
  • 993 సర్వే నెంబర్‌లో నిర్మాణాల కూల్చివేత
  • అధికారులు కఠిన చర్యలు

అమీన్ పూర్, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ మండలం 993 సర్వే నెంబర్ పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు చేపట్టారు. సీఎంసీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన ఈ డ్రైవ్‌లో బుల్డోజర్ దాడితో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేసి, అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలు నేలమట్టం చేశారు. స్థానికంగా కొంతకాలంగా ఈ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై విచారణ చేపట్టిన అధికారులు, భూమి రికార్డులను పరిశీలించి ఇది పూర్తిగా ప్రభుత్వానికి చెందిన భూమిగా నిర్ధారించారు. అనంతరం చట్టపరమైన నోటీసులు జారీ చేసి, చివరకు కూల్చివేత చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా అధికారులు హెచ్చరిస్తూ, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే గుర్తించి కూల్చివేస్తామని హెచ్చరించారు. అమీన్‌పూర్ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఇలాంటి దృఢ చర్యలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply