రౌడీ షీటర్లు శాంతికి భంగం కలిగిస్తే చర్యలు…

రౌడీ షీటర్లు శాంతికి భంగం కలిగిస్తే చర్యలు…

ఎస్సై ఉదయ్ కిరణ్

జన్నారం, ఆంధ్రప్రభ : రౌడీ, సస్పెక్ట్ షీటర్లు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషనులో రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు గురువారం సాయంత్రం ఎస్సై ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్ర‌తిఒక్క‌రూ చట్టపరమైన నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

భవిష్యత్లో ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడినచో వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయ తెలిపారు. ఆ వ్యక్తులు మంచి పౌరులుగా మారి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు చ‌ట్టం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవన్న పాల్గొన్నారు.

Leave a Reply