Rs5,400cr | క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన

Rs5,400cr | క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన

Rs5,400cr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాంబిల్లిలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి, జిల్లా అభివృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేశారు.

రాంబిల్లిలో రెన్యూ గ్లోబల్ ఎనర్జీ సంస్థకు చెందిన రూ.5,400 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

ఇటీవలే రూ.1.36 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌కు కూడా శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు. భారీ పెట్టుబడులు అనకాపల్లి జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

గతంలో వెనుకబడిన జిల్లాగా ఉన్న రంగారెడ్డి జిల్లా ఇప్పుడు దేశంలో ధనిక జిల్లాగా మారిందని ఉదాహరణగా చెప్పారు. అదే తరహాలో అనకాపల్లిని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం తన బాధ్యత అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply