గంజాయితో పట్టుబడ్డ యువకుడు

గంజాయితో పట్టుబడ్డ యువకుడు

ధర్మపురి, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా ధర్మపురిలో గంజాయి తరలిస్తున్న మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండల కేంద్రానికి చెందిన ఈసారపు ప్రణీత్ కుమార్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ధర్మపురి ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాల నుండి గంజాయి తాగడానికి అలవాటు పడి గురువారం గంజాయి తీసుకుని ధర్మపురి ప్రాంతంలోని హెచ్పి పెట్రోల్ బంకు దగ్గర గంజాయితో ఉన్నాడని ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

ప్రణీత్ ను విచారించిన తర్వాత అతడి దగ్గర 60 గ్రాముల నిషేధిత గంజాయిని స్వాధీన పరచుకుని పంచుల సమక్షంలో సీజ్ చేసి నిందితుడి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు సేవిస్తూ లేదా తరలిస్తూ పట్టుబడిన ఉపేక్షించేది లేదని కట్టు దిట్టంగా కేసులు చేస్తామని గంజాయిని అరికట్టడమే ప్రధాన ధ్యేయమని తెలిపారు.

Leave a Reply