రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం…

రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం…

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యంవిక్రయించండి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందనిరైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధి పొందాలని గిట్టుబాటు ధర చెల్లించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఊట్కూర్ సింగిల్ విండో ప్రత్యేక అధికారి అనసూయ, తాసిల్దార్ చింతరవి, ఎంపీడీవో కొండన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డిఅన్నారు.

బుధవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించాలన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం గ్రేడ్ ఏ రకానికి రూ. 2389, సాధారణ రకం రూ.2369 సన్న రకం వరి ధాన్యానికిరూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రైతులు పండించిన దాన్యంజాగ్రత్తగానిల్వ ఉంచుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రంలో దాన్యం విక్రయించడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి అన్నారు.రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యం దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులతో సహా వివిధ వసతులు ఏర్పాటు చేస్తున్నామనిఅన్నారు.

ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందనిఅన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందనిఅన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాఫర్, కొల్లంపల్లి అంజయ్య, నాగేష్, మానిటరింగ్ అధికారి శ్రీలత,ఆర్ఐ కృష్ణారెడ్డి, పిఎసిఎస్ కార్యదర్శి హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుకోరంమహేష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, వార్డుసభ్యులు పల్లె అనిల్ రెడ్డి, కొక్కు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.