రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం,
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం,
- మొక్క జొన్నల కొనుగోలు ప్రారంభంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి,
చిట్యాల, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించారు. అనంతరం చైర్మన్ శ్రీదేవి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రభుత్వం, అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు, రైతుల వ్యవసాయ పెట్టుబడికి రైతు భరోసా, సన్న వడ్లకు క్వింటాల్ రు 500 బోనస్, వేసవిలో రైతులు పండించిన మొక్కజొన్నలు, మార్క్ఫెడ్ పిఎసిఎస్, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
రైతులు గిట్టుబాటు ధర కోసం మొక్కజొన్నలు మండలాల్లో ఏర్పాటు చేసిన ఆయా సెంటర్లలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు . గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్మి మోసపోవద్దని రైతులను చైర్మన్ శ్రీదేవి కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధు వంశీకృష్ణ, చిలుకల రాయ కొ మురు, బుర్ర శ్రీనివాస్, గుమ్మడి సత్యనారాయణ, గుర్రపు తిరుపతి, అల్లం రాజు, చింతల సుమన్, ఆరేపల్లి నరసింహా రాములు, పిఎసిఎస్ కార్యదర్శి మెరుగు మొగిలి, మొక్క జొన్న కొనుగోలు ఇన్చార్జి, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు, గంగాధరి రవీందర్, రైతులు, దాడువాయిలు, హమాలీలు, కూలీలు పాల్గొన్నారు.
