Harishrao | సీఎం నిజస్వరూపం తెలిసిపోయింది
Harishrao | సీఎం నిజస్వరూపం తెలిసిపోయింది
Harishrao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో ఊరట లభించడంతో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన విచారణను న్యాయస్థానం తప్పుబట్టిందన్నారు.
ప్రజా సమస్యలను పక్కనబెట్టి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ తీర్పుతో ఆయన నిజస్వరూపం తేటతెల్లం అయిందని హరీశ్‌రావు ఆరోపించారు.
