దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దు

దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దు

  • చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ

మునుగోడు, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు ఆర్థికంగా నష్టపోవద్దని చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు.ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల రత్తిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ గ్రామ సర్పంచ్ జిట్టగోని సైదమ్మ సైదులు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నేలపట్ల నరేష్,ఏపిఎం గోసుల భాస్కర్,ఏఈఓ నిఖిల్,సి ఆర్ పి దీపిక,పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్,సి సి శంకర్,మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్,జిట్టగోని మల్లేష్,జిట్టగోని పరమేష్,సంఘ బంధం అధ్యక్షురాలు రాజేశ్వరి వివోఏ సుజాత,వార్డ్ మెంబర్స్,రైతులు తదితరులు పాల్గొన్నారు.