మైహోం పరిశ్రమలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు..

మైహోం పరిశ్రమలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు..
మేళ్లచెరువు, ఆంధ్రప్రభ : జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోం పరిశ్రమలో ఫైర్ స్టేషన్ ఎస్ఐ సుబ్బరాంరెడ్డి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో పరిశ్రమ కార్మికులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఫైర్ ఎస్ఐ సుబ్బరాంరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ డిజాస్టర్ టీం ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మైహోం పరిశ్రమ హెడ్ శ్రీనివాసరావు, ఫైర్ స్టేషన్ సిబ్బంది రవిబాబు దేశ్యనాయక్ నరసింహారావు శ్రీకాంత్ వెంకటేశ్వరరావు రామారావు ప్రశాంత్ శివ పరిశ్రమ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.
