Telangana | మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Telangana | మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవ‌రు మాట్లాడినా స‌హించేది లేద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. రాష్ట్ర విభ‌జ‌న‌పై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు స‌రికాద‌ని, ఆయ‌న వెంట‌నే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను ఇవాళ కేటీఆర్‌, హ‌రీశ్ పరిశీలించారు. అనంత‌రం విలేక‌రుల‌తో హరీశ్‌రావు మాట్లాడారు

బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సపోర్టుగా నిల‌వ‌డం దారుణ‌మ‌న్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే ఈ రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ, అంతే సంఖ్య‌లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఎంపీ తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఇప్పటి వరకు ఖండించక‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో స‌మాధానం ఇవ్వాల‌న్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని వెల్లడించారు. మహిళా బిల్లు విషయం లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు.

Leave a Reply