Delhi | తొక్కిసలాట మృతులకు రూ.10 లక్షల పరిహారం !

ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై భారత రైల్వే స్పందించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి కూడా తలా రూ.2.5 లక్షల పరిహారం ఆర్థిక సహాయంగా అందించనుంది. అదేవిధంగా, స్వల్ప గాయాలైన వారికి రూ.1 లక్ష చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని రైల్వే శాఖ ప్రకటించగా, బాధిత కుటుంబాలకు కొంత ఊరట కలిగింది.

ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించింది.

Leave a Reply