కవ్వాల టైగర్ జోన్లో 30కి మించి వాహనాలు నడపరాదు..

కవ్వాల టైగర్ జోన్లో 30కి మించి వాహనాలు నడపరాదు..

  • స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్

జన్నారం, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ రహదారుల గుండా ప్రయాణించే వాహనదారులు 30 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణించకూడదని స్థానిక ఎఫ్డీఓ ఎం. రామ్మోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ,టైగర్ రిజర్వ్ నిబంధన మేరకు ఈ రహదారుల గుండా వాహనాల గరిష్ట వేగాన్ని 30 కిలోమీటర్ల పరిమితిని విధించారన్నారు.

ఈ రహదారుల గుండా అంతకుమించి వాహనాలను వేగంగా నడిపినట్లు అయితే వన్యప్రాణులు ఢీకొని చనిపోయే ప్రమాదం ఉందని, అందుకోసమే వాహనాల వేగాలను నిరోధిస్తూ వన్యప్రాణులు రోడ్డు దాటే పలు ప్రాంతాలలో రహదారులపై ప్రమాదాల నియంత్రణ కొరకు భారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ప్రతినిత్యం టైగర్ జోన్ లోని రహదారుల గుండా పెద్ద పులులు, చిరుతపులులు,అడవి దున్నలు,అడవి పందులు,దుప్పులు, జింకలు,నీలిగాయిలు, కొండ గొర్రెలు, నెమళ్లు,కుందేళ్లు తదితర వన్యప్రాణులు రోడ్డు దాటుతూ సంచరిస్తాయని ఆయన చెప్పారు.ఈ ప్రాంతం గుండా ప్రయాణించే పలు రకాల వాహనదారులు నిబంధనలు పాటించి, సహకరించాలని ఆయన సూచించారు.

Leave a Reply