కోడూరులో వల్లభనేని అనుదీప్ జన్మదిన వేడుకలు

కోడూరులో వల్లభనేని అనుదీప్ జన్మదిన వేడుకలు
కోడూరు, ఆంధ్రప్రభ : మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరీ తనయుడు, యువ నేత వల్లభనేని అనుదీప్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కోడూరు పిఎస్పీఎస్ చైర్పర్సన్ పూతబోయన కరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో కేక్ ను పార్టీ నేతలు కట్ చేసి అనుదీప్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోడూరు పట్టణాధ్యక్షుడు కోట రాంబాబు, బడే భవనారాయణ, రేపల్లె రవీంద్ర, పూతబోయిన సీతారత్న సాయిబాబు, కాగిత రామారావు, ముద్దినేని చందర్రావు, మల్లా వెంకటేశ్వరరావు, కడవకొల్లు మల్లీ, రతన్ కుమార్, మంగళగిరి శ్రీనివాసరావు, బెల్లంకొండ సుబ్బయ్య, బచ్చు పూర్ణచంద్రరావు, పెద్ది బాబురావు తదితరులు పాల్గొన్నారు.
