దళిత రత్న అవార్డు అందుకున్నకలకొండ యాదగిరి

వెల్దండ, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అలుపెరుగని పోరాటాలల్లో కీలకపాత్ర పోసించి మాదిగలకు చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత నాయకులకు దళితుల కోసం విశిష్ట సేవలు అందించిన వారికి దళితరత్న అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం నల్లవారి పల్లి గ్రామం చెందిన ఎం ఆర్ పి ఎస్ (MRPS)నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి మాదిగ కు ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆధ్వర్యంలో ఉద్యమంలో పాల్గొని చేసిన సేవలను గుర్తించి దళిత రత్న అవార్డు అందజేయడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా కలకొండ యాదగిరి మాట్లాడుతూ దళిత రత్న అవార్డు రావడానికి సహకరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు టైగర్ మేడి పాపయ్య,ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గంట సుదర్శన్ కి రాష్ట్ర నాయకులకు మండల నియోజకవర్గ ఇన్చార్జిలకు అధ్యక్షులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
