108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన జిల్లా అధికారులు
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ నిర్మల్ జిల్లాకు చెందిన ఈ ఎం ఈ లింగాచారి నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రమైన కడెంలో 108 అంబులెన్స్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని పరికరాలను పరిశీలించారు.
ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని పిఎం జనార్ధన్ ఈ ఎం ఈ లింగాచారిలు కోరారు. ఈ కార్యక్రమంలో పైలట్ వసంత్ రావు, రాకేష్, ఈఎంటిలు సేవ మురళి తదితరులు పాల్గొన్నారు.
