185th birth | ఘనంగా ముక్తా సాళ్వె 185వ జయంతి వేడుకలు

185th birth | ఘనంగా ముక్తా సాళ్వె 185వ జయంతి వేడుకలు

185th birth | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఇవాళ భారతదేశ మొదటి విద్యార్థిని ముక్తాబాయి సాల్వే185వ జయంతి(185th anniversary) వేడుకలు మాంగ్ సమాజ్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జై నూర్ సర్పంచ్ కొడప ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు మాహాలే దత్త మాంగ్ లు ముక్తా సాల్వే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దత్త మాంగ్ మాట్లాడుతూ…ఇంగ్లాండ్ మహారాణి మనస్సును గెలిచి, మహాత్మా జ్యోతిబా ఫూలే మాతా సావిత్రి బాయి పేర్లను నిలబెట్టిన మొదటి ఉత్తమ విద్యార్ధి ముక్తా సాళ్వె(Mukta Salve) అన్నారు. జైనూర్ సర్పంచ్ కొడప ప్రకాష్ మాట్లాడుతూ… ఆనాటి కాలంలో ముక్తా సాల్వే చేసిన సేవలను ప్రశంసనీయమని ఆమె చేసిన సేవలను రాబోయే తరాలకు గెలిచే విధంగా జయంతి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని ఆయన అన్నారు.

ముక్త సాల్వే విద్యా జ్ఞానమే దివ్య ఔషధం అని ఘనంగా చాటి చెప్పి విద్యార్థులకు మార్గదర్శిగా మహిళలకు గొంతుకగా నిలిచినా ముక్తా సాళ్వె జయంతిని విద్యార్ధి దినోత్సవంగా నిర్వహించి, ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జైనూర్ ఉపసర్పచ్ డోంగ్రే ప్రకాష్, వార్డ్ మెంబర్ తోడడం పి. దూర్పతాబాయి మాంగ్, ఎం.విఠాబాయి మాంగ్, పి.కాంతాబాయి మాంగ్, ఎస్.దైవా బాయి మాంగ్, కె.శ్రీహరి మాంగ్, కె. లక్ష్మణ్ మాంగ్, డి.ఆదిత్యానంద్ మాంగ్, మాంగ్ సమాజ్ ప్రజలు పాల్గొన్నారు.