చరిత్రలోనే శాశ్వత స్థానం సంపాదించిన మహామేధావి అంబేద్కర్..

చరిత్రలోనే శాశ్వత స్థానం సంపాదించిన మహామేధావి అంబేద్కర్..

  • దళిత రత్న అవార్డు గ్రహీత, సామాజికవేత్త తాళ్లపల్లి జయరాజ్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ప్రపంచం చరిత్రలోనే శాశ్వత స్థానం సంపాదించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత రత్న అవార్డు గ్రహీత, సామాజికవేత్త తాళ్లపల్లి జయరాజ్ అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలో భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్బంగా జయరాజు మాట్లాడుతూ అన్యాయం, అసమానత, అణచివేతల మధ్య జన్మించి వాటినే సవాల్‌గా తీసుకుని ప్రపంచానికి సమానత్వం, స్వాభిమాన మార్గాన్ని చూపిన మహానుభావుడని పేర్కొన్నారు.

అంబే ద్కర్ కేవలం భారత రాజ్యాంగం రూపకర్త మాత్రమే కాదు…ఆయన ఒక దార్శనికుడు, సమాజాన్ని మలిచిన సంస్కర్త అని పేర్కొన్నారు. శతా బ్దాలుగా అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఒక ఉద్యమంగా మారి భారత సమాజాన్ని కొత్త దిశగా నడిపించారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చిన్ననాటి నుంచే అనేక వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ, విద్యనే ఆయుధంగా ఎంచుకుని ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అభ్యసించి, తన ప్రతిభతో సమాజానికి సేవ చేయాలని సంకల్పించారన్నారు.

  • దళితుల హక్కుల కోసం నిరంతరం కృషి:

దళితుల హక్కుల కోసం, మహిళల సమాన హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని జయరాజ్ పేర్కొ న్నారు. జ్ఞానం, విముక్తి మార్గం అనే నమ్మకంతో ఆయన సాగిన పయ నం ప్రతి యువకుడికి ఆదర్శమన్నారు. స్వేచ్ఛ, సమానత్వం సోదర భావం ఈ మూడు విలువలే భారత ప్రజాస్వామ్యానికి జీవం పోశాయ ని పేర్కొన్నారు. అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు ఆయన చేసిన పోరాటం చరిత్రలో ఒక మహత్తర ఉద్యమంగా నిలిచిందన్నారు. మనిషి గొప్పదనం అతని పుట్టుకలో కాదు..

అతని ఆలోచనల్లో ఉంది అనే భావజాలం సమాజానికి దిశాని ర్దేశం చేస్తుందని తెలిపారు. యువత ఆయన ఆశయాలను అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుం దన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆయన విగ్రహాలకు పూలమాలలు అర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. కానీ నిజమైన నివాళి అంటే…

ఆయన చూపిన మార్గంలో నడవడం, సమాన త్వ సమాజ నిర్మాణానికి కృషి చేయడమన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే, నిజమైన సమానత్వ భారతాన్ని నిర్మించగలమని జయరాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply