లారీ డ్రైవర్ కూతురు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్

లారీ డ్రైవర్ కూతురు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్

ఇలాంటి వారిని స్పూర్తిగా తీసుకోవాలి
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
బాలికను సన్మానించిన మంత్రి

మక్తల్, ఆంధ్రప్రభ : చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు నిరుపేద కుటుంబానికి చెందిన పి. జయలక్ష్మి అనే ఇంటర్ విద్యార్థి.మక్తల్ పట్టణానికి చెందిన పి.జయలక్ష్మి 6వ తరగతి నుండి గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. మలక్పేట్ మహాత్మ జ్యోతిరావు పూలే జూనియర్ కళాశాలలో బైపిసి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 981/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్ గా నిలిచింది లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఫుట్పాక్ సుధాకర్ రెడ్డి నాగమణి దంపతుల కూతురు జయలక్ష్మి ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల సర్వత్రా సర్షం వ్యక్తమవుతుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, బి కే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి సిద్దివినాయక ప్రాపర్టీ డెవలపర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ లారీ డ్రైవర్ కూతురు చదువులో టాపర్గా నిలవడం అభినందనీయమని అన్నారు. చదువుకు పేదరికం అనేది అడ్డు కాదని నిరూపించిన విజయలక్ష్మిని వారు ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతి విద్యార్థి ఇలాంటి బాలికలను స్ఫూర్తిగా తీసుకొని చదువులో రాణించాలని సూచించారు .ఉన్నత చదువులకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బాలిక తల్లిదండ్రులు పుట్పాక్ సుధాకర్ రెడ్డి, నాగమణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి. రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply