అంబేద్కర్ ఆశయాల సాధనలో మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

అంబేద్కర్ ఆశయాల సాధనలో మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : భారతరత్న డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. నాయకులు పూలమాలలు వేసి, అనంతరం పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సమాజంలో అసమానతలను తొలగించి ప్రతి వర్గానికీ సమాన న్యాయం అందించాలన్న బాబాసాహెబ్ లక్ష్యాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదంతో సామాజిక సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు తీసుకుంటున్న చర్యలే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. అంబేద్కర్ సేవలను గౌరవిస్తూ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందజేయడం ద్వారా దేశం ఆయనకు గౌరవం తెలిపిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు: మండల పార్టీ ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్, కార్యదర్శులు ఓదెల అశోక్, పున్నం కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు పెరుమాండ్ల కోటి, వల్లే పర్వతాలు, ఎస్సీ మోర్చా నాయకులు జన్ను మధు, యువ మోర్చా నాయకులు తిమ్మాపురం శివ, ఓబీసీ మోర్చా నాయకులు ములుక రాజేష్, బూత్ అధ్యక్షులు ధర్మారం క్రాంతి కుమార్, కొనకటి సుధాకర్, బల్ల రాజు, ఈర్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply