వేంగవంతంగా మొక్కజొన్నల తరలింపు..

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఈ యేడాది మొక్కజొన్నలను అధికంగా సాగు చేశారు. దీంతో మార్కెఫైడ్ వారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించారు. మొదట్లో కాంటాలు, లారీలు, హమాలీల కొరత ఉండడంవల్ల కాస్త ఇబ్బందిగా మారి జాప్యం జరిగింది. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి తరలింపును వేగవంతం చేశారు.
కొనుగోలు చేసినటువంటి మక్కలను ప్రైవేట్ గోదాములకు తరలిస్తున్నారు. దిగుమతి దగ్గర కాస్త ఆలస్యమైన వేగవంతంగా చేస్తున్నారు. గోదాముల దగ్గర పోలీసులు,రెవిన్యూ వివిధ శాఖల సిబ్బంది మండుటెండలో కూడా రైతులతో పాటే ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 75 వేల బస్తాలను తరలించారని ఇంకా 10వేల బస్తాల వరకు ఉంటాయని వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన తరలిస్తూ ధాన్యాన్ని కూడా వెంటనే తరలించనున్నట్లు నిర్వహుకులు తెలిపారు.
