అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం

అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : ప్రపంచ దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని దళిత ఐక్య సంఘటన భీంగల్ గౌరవ అధ్యక్షులు కండె కాంతయ్య అన్నారు. మంగళవారం భీంగల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా భీంగల్ ప్రాంత దళిత ఐక్య సంఘటన గౌరవ అధ్యక్షులు కండె కాంతయ్య వహిస్తూ ప్రపంచంలోనే గొప్ప దర్శని కత ప్రదర్శించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి వలన అందరూ హక్కుల అనుభవిస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యలు కావాలని అన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ లత, జేజే నర్సయ్య , కమీషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దార్శనికుడుగా, రాజనీతిజ్ఞుడుగా, జర్నలిస్టుగా, న్యాయవాదిగా భారత సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ గ్రామంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు, పర్సనవీన్, తుమ్మ రవీందర్, దుమల భూమన్న,దేవదాసు,ఎస్ఐ తిరుపతి , డి టి ఎఫ్ నాయకులు ఎం బాలయ్య, ఈశ్వర్ బట్టు సునీల్, బట్టు అనిల్, బద్దం సంపత్, టారమెటి రాహుల్, భీమ రవీందర్, పత్రీ రాజేందర్ అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు, అంబేద్కర్ వాదులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
