Statue | డిప్యూటీ సీఎం పవన్ కు బహుమతి…

Statue | డిప్యూటీ సీఎం పవన్ కు బహుమతి…
Statue | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా బంగారంతో రూపొందించిన సూక్ష్మ అంబేద్కర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జనసేన నాయకురాలు ఫాతిమా రాణి ఈ మైక్రో విగ్రహాన్ని రూపొందించారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బంగారంతో రూపొందించిన మైక్రో అంబేద్కర్ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం రెండు సెంటీమీటర్ల పరిమాణంలో ఈ సూక్ష్మ విగ్రహాన్ని జనసేన నాయకురాలు ఫాతిమా రాణి రూపొందించారు.

అంబేద్కర్ ఆశయాలను ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ మైక్రో గోల్డ్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా అందించనున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఇది తగిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఫాతిమా రాణి పేర్కొన్నారు. త్వరలోనే ఈ బహుమతిని ఆయనకు అందజేస్తానని తెలిపారు.

