ప్రయాణాల్లో నిర్లక్ష్యంతో.. ప్రాణాలకు ముప్పు…

ప్రయాణాల్లో నిర్లక్ష్యంతో.. ప్రాణాలకు ముప్పు…
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
మోత్కూర్, ఆంధ్రప్రభ ప్రయాణికులు తమ ప్రయాణాల్లో నిర్లక్ష్యంతోనే ప్రాణాలకు ముప్పు వస్తుందని,విధిగా హెల్మెట్ ,సీట్ బెల్టు ధరించి తమ కుటుంబాలకు భరోసా గా ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, కార్లలో సీట్‌బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. అధిక వేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. ప్రతి కుటుంబానికి ఆదారమైన వ్యక్తి ప్రమాదంలో పడితే ఆ కుటుంబం ఆర్థికంగా, భావోద్వేగంగా తీవ్రంగా నష్టపోతుందన్నారు.

ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, సిగరెట్ తాగుతూ వాహనాలు నడిపే అలవాట్లను మానుకోవాలని సూచించారు. ఇటువంటి చర్యలు తమకే కాకుండా ఎదుటివారికి కూడా ప్రమాదకరమని తెలిపారు. ప్రత్యేకంగా స్కూల్ బస్సు డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని, పిల్లల ప్రాణాలు అత్యంత విలువైనవని గుర్తుచేశారు. భవిష్యత్తు తరానికి మేలు చేసే పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు.
ఈ సందర్భంగా సి ఐ వెంకటేశ్వర్లు రోడ్డు భద్రత పట్ల సందేశం చదువుతూ ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ సతీష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కమిషనర్ కె సతీష్ కుమార్, ఏ పి ఐ డి సి మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరి రెడ్డి, జిల్లా నాయకులు ఫైళ్ల సోమిరెడ్డి, డా లక్ష్మి నర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్ పి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు కూర్మిళ్ల ప్రమీల, పన్నాల శ్రీవిద్య, కారుపోతుల వెంకన్న, మాజీ కౌన్సిలర్ పురుగుల వెంకన్న, మాజీ కో ఆప్షన్ సభ్యులు గనగాని నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
