HYD | ఉప్ప‌ల్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

HYD | ఉప్ప‌ల్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో నాగోల్ – హబ్సిగూడ, బోడుప్పల్ – అంబర్‌పేట మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కాకుండా వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మ్యాచ్ సంద‌ర్భంగా స్టేడియం సమీపంలో నాలుగు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. పాస్ ఉన్నవారి వాహనాలకు మాత్రమే స్టేడియం లోపల పార్కింగ్‌కు అనుమతిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

అయితే మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ట్రాఫిక్‌ను మ‌ళ్లించాల‌ని పోలీసులు నిర్ణ‌యించారు. ఘట్‌కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మెహిఫిల్ హోటల్ హెచ్‌ఎండీఏ భగాయత్ వద్ద నాగోల్ – ఎల్‌బీనగర్ వైపుగా మళ్లిస్తారు. ఎల్బీ‌నగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో వద్ద యూటర్న్ ఇచ్చి బోడుప్పల్ – చెంగిచర్ల మార్గంలో పంపిస్తారు. తార్నాక వైపు నుంచి వచ్చే వాహనాలను హబ్సిగూడ ఎక్స్ రోడ్డు వద్ద నాచారం – ఎన్ఎఫ్‌సీ – చర్లపల్లి మార్గంలో మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలను స్ట్రీట్ నెం. 8 వద్ద హబ్సిగూడ – నాచారం మార్గంలోకి డైవర్ట్ చేయ‌నున్నారు.

Leave a Reply