ట్రాఫిక్ సీఐని కలసిన టీడీపీ అధ్యక్షుడు రవికుమార్….

ట్రాఫిక్ సీఐని కలసిన టీడీపీ అధ్యక్షుడు రవికుమార్….

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి.

పాయకాపురం, ఆంధ్రప్రభ : నగర శివారు ప్రాంతమైన స్థానిక 64 డివిజన్ కండ్రిక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ను కోరారు. పాయకాపురంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిఐ ప్రభాకర్ను, టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువతో ఘనంగా సన్మానించారు.

అనంతరం డివిజన్లోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సిఐ ప్రభాకర్ కోరారు. ఎస్.కె బాబు, కోమరి రాజేష్, కంకణాల బాబు తదితరులు సీఐని కలసిన వారిలో ఉన్నారు.

Leave a Reply