14న ఫతేగడ్ గురుద్వారా లో బైసఖి పండగ…

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; సిక్కుల నూతన సంవత్సర పండగ ఈనెల 14న కంటేశ్వర్ లోని ఫతేగడ్ గురుద్వారా లో బైసఖి పురస్కరించుకొని సిక్కు సోదరులు పాల్గొనాలని సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి కోరారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ.. ఈనెల 14న గురుద్వారాలో ఉదయం నుండి భజనలు , కీర్తనలు మధ్యాహ్నాం భోజనాల ఏర్పాట్లు ఉంటాయని ఆయన తెలిపారు.

అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటల నుండి కంటేశ్వర్ లోని గురుద్వారా దగ్గర నుండి ఊరేగింపు బయలుదేరి ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, తిలక్ గార్డెన్, భగత్ సింగ్ చౌరస్తా, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్టాండ్ నుండి బర్కత్పురా మీదుగా బయలుదేరి స్థానిక గాజులపేట్ గురుద్వారా వద్దకు చేరుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో సిక్కు సోదరులు భజన కీర్తనల తో బయలుదేరి ఘనంగా బైసాఖి నూతన సంవత్సర పండగ ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

ఈ పండగను కల్స పంత్ పండగ అని కూడా అంటారుఅని. శ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్ మార్చ్ 30 న 1699 లోకల్సా పంత్ ను కేష్ గర్ సాహెబ్ , అమృత్ సర్ లో పంచ్ ప్యారేలను తయారుచేసి దేశ సమైక్యత కొరకు, కుల మతాలకు తావు లేకుండా దేశాన్ని ధర్మాన్ని రక్షించుటకై పివివిధ మతాలకు చెందిన ఐదుగురిని అమృతం తాగించి పంచ్ ప్యారేగా నామకరణం చేసి ప్రతి సిక్కు సోదరుడిని సింగ్ గా ప్రకటించారు అని తెలిపారు. ఈ పండుగను పంజాబ్, హర్యానా లో రైతుల పండుగగా జరుపుకుంటారు. అని, పంటలు బాగా పండి దిగుబడి బాగా రావాలని గురు గ్రంథ సాహెబ్ ను ప్రార్థిస్తారు అని అన్నారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ సోడి బైసాఖి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply