ఇంటర్ ఫలితాలలో వీఆర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ సత్తా ప్రదర్శించారు.కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తమ విద్యార్థులు మార్కులుసాధించారని ప్రిన్సిపల్ నాళం అయ్యప్ప తెలిపారు. మార్కులు సాధించిన వారిలో సెకండ్ ఇయర్ ఎంపీసీ లోబైరి అక్షిత 991/1000,బిరుదు శృతి 988 /100,బైపీసీ లో పర్రె ప్రణిత 984 /1000, కోయిలకారి మేఘన 979/ 1000,సిఈసి లో 959 /1000,మార్కులు పొందారని వివరించారు.

ఫస్ట్ ఇయర్ ఎంపీసీ లో చిట్టోజు సాయి ప్రసన్న 463 /470,జూవేరియా 461 / 470,బైపీసీ లోసఫూరా ఫిర్దోస్ 431/440,నరెడ్డి స్పందన 430 / 440సిఈసి లో నాజియా జబీన్ 479 / 500, ఎండి అంజర్ 442 / 500 మార్కులుసాధించారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. వైస్ ప్రిన్సిపాల్ ఉప్పలి రాజు, అధ్యాపకులు పరుశరాములు, మానస, మధుసూదన్, వీరాచారి , కమలాకర్, సునంద, కృష్ణ, ఉప్పాచారి, రమేష్, ఇందిర, లావణ్య, నమీరా, సుభాష్,వంశీ,సింధు,నర్మద పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply