ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వసంత ఆకస్మిక తనిఖీ…

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వసంత ఆకస్మిక తనిఖీ…

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. సాయంత్రం 4 గంటలకు ఆసుపత్రిలోకి వెళ్ళిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై తీశారు. ఆసుపత్రిలో సంతృప్తికరంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు రోగులు తెలిపారు.సర్జికల్ వార్డును, జనరల్ వార్డును, ప్రసూతి వార్డును పరిశీలించారు. తొలుత ఆసుపత్రి రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది అందరూ హాజరయ్యారో లేదో విచారించారు.

ఓ ఇద్దరు వైద్య సిబ్బంది ఆసుపత్రి సూపరిండెంట్ అనుమతితో బయటికి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్, వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సమావేశం అయ్యారు. వైద్యసేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేయడంతో వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. వైద్యో నారాయణో హరి అన్నారని, రోగుల ప్రాణాలు రక్షిస్తున్న వైద్యులు అందిస్తున్న సేవ దేశ సేవతో సమానం అన్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువగా ఉంది పేదలు వస్తుంటారని వారికి ఇక్కడ అంకిత భావంతో సేవలు అందిస్తున్న వైద్యులను అభినందించారు. ఆసుపత్రిలో ఇటీవల జనరేటర్ సౌకర్యం కల్పించారని, ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రతిపాదనలు పంపి, ఓటి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఆసుపత్రిలో సాధారణ అవసరాలు గుర్తించి, ఇతరత్రా ఏర్పాట్లను దాతలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఆసుపత్రి సిబ్బంది షాక్ అయ్యారు.

Leave a Reply