సమాజ దిశను మార్చిన మహాత్మా ఫూలే…

సమాజ దిశను మార్చిన మహాత్మా ఫూలే…
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతీబా ఫూలే సమాజ దిశను మార్చారని విద్యుత్ ఉద్యోగులు, బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీజీఎస్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ కార్మికుల సంక్షేమం, సామాజిక సమానత్వం, విద్యా విస్తరణలో మహాత్మ పూలే చేసిన సేవలను కొనియాడారు.
సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఏడీఈ లక్ష్మణ్, చింతా గోపాల్, దాకూరి అశోక్‌గౌడ్, 32వ వార్డు కౌన్సిలర్ నాయకోటి నవీన్, టీపీడీఈఏ జనరల్ సెక్రటరీ సిద్ధరాజు, మధుసూదన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి జంగం, అనంతరెడ్డి, మురళి, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు సామాజిక చైతన్యానికి దోహదపడేలా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
