చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం

చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం
తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు బాలవికాస ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పత్తేపురం, వెంకటాపురం గ్రామాల సర్పంచ్ ఇట్టే మాధవరెడ్డి, ధరావత్ విజయ రవి లు అన్నారు. బాలవికాస ఆధ్వర్యంలో శనివారం మండలంలోని వెంకటాపురం, పత్తేపురం గ్రామాలలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో బాలవికాస సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వేసవి కాలంలో చల్లటి నీళ్లు అందించేందుకు బాలవికాస చొరవ చూపడం అభినందనీయమన్నారు.
వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేటందుకు చలివేంద్రం బాగా ఉపయోగపడుతుందన్నారు.ఈ మూడు నెలలు బాటసారులకు దాహార్తిని తీర్చేటందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు బాలవికాస సంస్థకి కృతజ్ఞతలు తెలియజేశారు. 3 నెలలు కావలిసిన నీరు పోయడానికి వాటర్ తాత దాసరి సాగర్ ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బాలవికాస సెంటర్ మేనేజర్ వై.రమ, మెయిన్ కోఆర్డినేటర్ ఎం. రమ, కోఆర్డినేటర్ ఎం సరిత, జె. శైలజ, ఎం శోభారాణి,ఉప సర్పంచ్ లు మొగుళ్ల లింగన్న గౌడ్, సతీష్, వార్డు మెంబర్లు గండి శ్రావణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బలగాని సోమలక్ష్మి, మాజీ వార్డు సభ్యులు బి.శ్రీలత, బాల వికాస మహిళలు మహేంద్ర, పద్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
