TG | కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి..

TG | కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి..
బాల్క సుమన్
TG | క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, బాల్క సుమన్ ఆహ్వాన మేరకు, ఈనెల 12న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. నస్పూర్ లో తెలంగాణ భవన్లో జరిగే కార్యకర్తల మీటింగులో పాల్గొని, భవిష్యత్తు కార్యాచరణ దిశ నిర్దేశం చేయనున్నారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలకమండలి సభ్యులను సన్మానించి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహానికి హాజరవుతారని తెలిపారు. బాల్క సుమ నివాసంలో వివిధ సంఘాల నాయకులతో చర్చిస్తారని, అన్నారు. ఈ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు తరలిరావాలని కోరారు.
