ఏమైంది.. ఈ పోలీస్ స్టేషన్‌కు?

ఏమైంది.. ఈ పోలీస్ స్టేషన్‌కు?

వివాదాల్లో అధికారులు, సిబ్బంది…

మాచర్ల, ఆంధ్రప్రభ : పట్టణ పోలీస్ స్టేషన్ కు వరుస వివాదాలు చుట్టుముట్టాయి. గత నెలలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట వ్యవహారంలో ముడుపులు తీసుకొని చౌడమ్మ అనే యువతి పరువు హత్యకు సీఐ వెంకట రమణ పరోక్షంగా సహకారం అందించి సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు మరలా ఓ ఏ ఎసై, ఎసై, కానిస్టేబుల్ పై ఆరోపణలు రావటం ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది.

పట్టణంలో ఏఎసై గా పనిచేస్తున్న శ్రీనివాస రావు నిర్జన ప్రదేశంలో ఉండే ప్రేమ జంటలను బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయటంతో పాటు కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రజలు విస్తుపోతున్నారు.

మొదటి నుంచి వివాదమే!

ఏఎస్ఐ శ్రీనివాసరావు వ్యవహారం మొదటినుంచి వివాదాస్పదం అనే తెలుస్తుంది. ఈతను ప్రతిరోజూ ఒక ఆటోలో వెళ్లి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించే వారిని, ప్రేమ జంటలను రహస్యంగా వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడని చాలామంది ఆరోపిస్తున్నారు.

మద్యం మత్తులోనే డ్యూటీ చేస్తుంటాడని ప్రత్యక్ష బాదితులు చెప్పటం చూస్తే ఎంతోమంది ఈతని వేధింపులకు గురయ్యారో తెలుస్తోంది. ఈ స్టేషన్ లోనే పనిచేసే ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ మీద కూడా ఇటువంటి ఆరోపణలు వినపడటంతో జిల్లా అధికారులు ఈ స్టేషన్ వ్యవహారం పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Leave a Reply