Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha Top Story

Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha Top Story
- చర్చలకు పాకిస్థాన్ విడిది రెడీ
- ఇప్పటికే ఇరాన్ బృందం రాక
- ఇక అమెరికా ప్రతినిధులూ సిద్ధం
- ఇస్లామాబాద్ అకార్డ్’పై ఆశలు
- ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదన
- అమెరికా 15 పాయింట్ల ప్రణాళిక
- హోర్ముజ్ మళ్లీ హాట్‌టాపిక్
- లెబనాన్, యెమెన్ అంశాలపై అనిశ్చితి
- పాకిస్థాన్ భద్రత కట్టుదిట్టం
- రెండు రోజులు సెలవు
(ఆంధ్రప్రభ, ఇస్లామాబాద్ ప్రతినిధి)

లెబనాన్ లో ఇజ్రాయెల్ సృష్టించిన భీకర నరమేధంతో… ప్రపంచం మొతం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా… అమెరికా ఇరాన్‌ల మధ్య రెండు వారాల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఒప్పంఆనికి కీలక డిమాండు హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొననప్పటికీ.. అమెరికా, ఇరాన్ మధ్య రాజీతంత్రాంగం తగు ఫలితం ఇచ్చే వాతావరణం కనిపిస్తోంది. శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ సిద్ధమవుతోంది. కొన్ని గంటల కిందట కుదిరిన ఈ ఒప్పందం తర్వాత ప్రాంతమంతటా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ సహా.. గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని తెరిచాయి. విమానం రాకపోకలు ప్రారంభం కాగా.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల వల్ల కాల్పుల విరమణకు కొంత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని యూరోపియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో కూడా ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్నట్టు నెలకొన్నట్లు నివేదికలు అందుతున్నాయి.
Iran Us Peace Talks : ప్రతినిధి బృందాలు సిద్ధం

ఇరాన్ తో పాకిస్థాన్ లో జరిగే చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ (JD Vance) నేతృత్వంలోని ఓ బృందం సిద్ధమవుతోంది. . ఈ బృందంలో మధ్యప్రాచ్య ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ప్రెసిడెంట్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఇరాన్ ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం కూడా ఈ చర్చల కోసం ఇస్లామాబాద్ కు చేరుకుంది. మొదటి రౌండ్ చర్చలు శనివారం (ఏప్రిల్ 11) ఉదయం ప్రారంభం కానున్నాయి. ఇందుకు పాకిస్థాన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ఈ చర్చలను “చారిత్రక ఘట్టం”గా అభివర్ణించారు.
Iran Us Peace Talks : భద్రత,కట్టుదిట్టం

ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమీపంలోని సెరెనా హోటల్ (Serena Hotel) ఈ చర్చలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ హోటల్‌ను పూర్తిగా పాకిస్థాన్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇస్లామాబాద్‌లోని ‘రెడ్ జోన్’ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. సైన్యం పహారాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ చర్చల దృష్ట్యా భద్రత , రవాణా సౌలభ్యం కోసం ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 9, 10 తేదీలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ పర్యటన దృష్ట్యా, అమెరికా సీక్రెట్ సర్వీస్ కు చెందిన 23 మంది అధికారులు ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ, అమెరికా రాయబారి నటాలీ బేకర్‌తో భేటీ సంప్రదింపులు జ రిపారు. , విదేశీ ప్రతినిధులందరికీ “ఫూల్‌ప్రూఫ్ సెక్యూరిటీ” ఉంటుందని హామీ ఇచ్చారు.
Iran Us Peace Talks : ఇరాన్ 10 పాయింట్లు..
Iran Us Peace Talks : అమెరికా 15 ఫార్ములా
అమెరికా ఇరాన్‌ల మధ్య ఈ శాంతి చర్చలు ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 11 (శనివారం) నుంచి ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ చర్చలతో శాశ్వత శాంతి ఒప్పందం (Permanent Peace Treaty) కుదిరే అవకాశాలపై చర్చ జరుగుతుంది. ఈ రెండు వారాల కాల్పుల విరమణను ఒక శాశ్వత ఒప్పందంగా మార్చడానికి ఈ రెండు దేశాలూ తమ ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్నాయి. ఇరాన్ తన పది అంశాల ప్రతిపాదనను “శాశ్వత శాంతికి పునాది”గా పేర్కొంటోంది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) నుంచి అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగించకుండా చూడటం. ఇరాన్‌పై అన్ని ఆర్థిక ఇతర ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా నుండి పరిహారం కోరుతోంది. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయబోమని హామీ ఇస్తూనే, శాంతియుత అణు ఇంధన అభివృద్ధిని గుర్తించాలని కోరుతోంది.
అమెరికా 15-పాయింట్ల ప్రణాళికను ‘ఇస్లామాబాద్ అకార్డ్’ (Islamabad Accord) అని పిలుస్తోంది. అమెరికా ప్రధానంగా ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని , ప్రాంతీయ ప్రాక్సీ గ్రూపులకు మద్దతు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ ప్రతిపాదనలను “చర్చలకు తగిన పునాది” (workable basis) అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభివర్ణించడమే కాకుండా, త్వరలోనే ఒక “నిశ్చయాత్మక ఒప్పందం” (Definitive కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Iran Us Peace Talks ఆ రెండే పీటముళ్లు

ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, కొన్ని అంశాలు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. అమెరికా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఎథిక్ ప్యూరీతో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. 3000 పైగా ఇరానీయులు మృతి చెందారు. మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి హోర్ముజ్ జలసంధిలో నౌకల నుంచి హప్తా వసూలు చేసే అవకాశాన్ని ఇరాన్ డిమాండు చేసస్తోంది. ఒక బ్యారెల్ ముడిచమురుకు ఒక డాలరు టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే యూరో దేశాలు అభ్యంతరం చెప్పాయి. కాల్పుల విరమణ కేవలం అమెరికా-ఇరాన్‌ల మధ్య మాత్రమే ఉండాలా లేక లెబనాన్, యెమెన్ వంటి ప్రాంతాలకు విస్తరించాలా అనే దానిపై స్పష్టత లేదు. ఇరాన్ ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్‌లతో కాకుండా నేరుగా వాన్స్‌తోనే చర్చలు జరపాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ చర్చలను పర్యవేక్షణలో పాకిస్థాన్ సహా ఈజిప్ట్ కూడా గ్యారెంటీర్‌గా వ్యవహరిస్తోంది.
ALSO READ : Iran Toll Troll : హోర్మజ్ తెరిస్తే,, Andhra Prabha Top Story
