విద్యార్థులకు నోట్ బుక్ లు అందజేత…

విద్యార్థులకు నోట్ బుక్ లు అందజేత…
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేటలోరెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలోమృతి చెందిన జిల్లపెల్లి ప్రణయ్ రాజ్ జ్ఞాపకార్థం, ఆయన ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణయ్ రాజ్ సోదరుడు వినయ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని, సురక్షిత ప్రయాణం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు,పొలంపెళ్లి రామరాజు, పొలంపెళ్లి శ్రీనివాస్, గ్రామ యూత్ సభ్యులు కన్నెపెల్లి అంజి, గణేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
