చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

కూచిపూడి – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి యెండూరి సాయి. ఫణీంద్ర కుమార్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డికె.బాలాజీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎండివో డి.సుహాసిని గురువారం విలేకరులకు తెలిపారు. ఆమె అందించిన వివరాల మేర మార్చి 29వ తేదీన డిపివో జె.అరుణ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా ఇంటి పన్నుల వసూళ్ల వేగవంతంపై కార్యదర్శికి పదే పదే సూచనలు చేసినప్పటికీ డిఎల్పివో కార్యాలయ ఏవో నుంచి ఆదేశాలు అందినప్పటికీ వసూళ్ల పని తీరును మెరుగుపర్చటంలో విఫలం చెందారు.

కావున విధుల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యం. ఉన్నతాధికారుల సూచనలు ధిక్కరించటాన్ని బట్టి గుడివాడ డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ప్రకారం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎండివో తెలిపారు. ఈ సస్పెన్షన్ గురువారం నుంచి అమలులోకి వస్తోందని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply