ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..

  • నారాయణపేట జిల్లాచీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే లక్ష్మీపతి గౌడ్

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రతి ఒక్కరూ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని నారాయణపేట జిల్లాచీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే లక్ష్మీపతి గౌడ్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించబడ్డాయనిఅన్నారు.

చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ప్రజలు చట్టాలపై అవగాహన కలిగినప్పుడే నిర్భయంగా తమ హక్కులను సాధించుకుంటారని అన్నారు. ప్రజలు వైద్య, న్యాయ సేవలు పొందేందుకు ఉచిత న్యాయ సేవా సలహాల కోసం సంప్రదించాలన్నారు. ఎస్సీ ఎస్టీ లకు ఉచితంగా బీసీలకు 3 లక్షల లోపుఆదాయం ఉన్నవారికి ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చఅన్నారు.

చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చట్టాలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సంతోషి, భవాని, ఏఎస్ఐ సంజీవయ్య, హెల్త్ సూపర్వైజర్ మణిమాల, పారాలీగల్ వాలంటీర్లు హాజమ్మ, నారాయణ, ఉమా, వర్ష శోభ భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply