పేదింటి వివాహాలకు అండగా కోడం శివకృష్ణ

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ తూర్పు నియోజకవర్గం 33వ డివిజన్ శాంతినగర్‌కు చెందిన కోడం శివకృష్ణ పేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

గురువారం డివిజన్‌లో వెనుకబడిన కుటుంబాల్లో జరుగుతున్న వివాహాలకు కొండా యువసేన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోడం శివకృష్ణ సహాయం అందించి మానవతా విలువలను చాటిచెప్పారు.

పెళ్లి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోగడ్త సుజాత–సుదర్శన్, శెట్టి పార్వతి–మరణించిన రవి కుటుంబాలకు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.

సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు కోడం శివకృష్ణను శాలువాతో సన్మానించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా, ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శెట్టి శ్రీనివాస్, కొమ్మరాజుల సందీప్, బొమ్మగాని శ్రీనివాస్, తొగరు చందు, దయాసింగ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply