రేషన్ షాపుకు వచ్చే వారి కోసం..

రేషన్ షాపుకు వచ్చే వారి కోసం..

వర్ని, ఆంధ్రప్రభ : రేషన్ బియ్యం తీసుకొనే వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండటం కోసం వర్ని గ్రామంలో రేషన్ షాపు వద్ద నీడ, మంచినీటి వసతిని సర్పంచ్ ఏర్పాటు చేశారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తూ ఉండటంతో వినియోగదారులు ఎండకు ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల అవస్థలు గమనించిన సర్పంచ్ నీడ కోసం టెంటు ఏర్పాటు చేసారు.

మంచి నీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు జిల్లా అధ్యక్షులు నగేష్, ఉప సర్పంచ్ దారం గంగాధర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్కూర్ మొగలయ్య, కార్యదర్శి కల్లూరు జీవన్, ఉపాధ్యక్షులు పెఱిక సాయిలు, మాజీ ఎంపిటిసి వీరయ్య రాజా గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply