కొత్తపల్లి పాఠశాలకు దాతల చేయూత…

కొత్తపల్లి పాఠశాలకు దాతల చేయూత…

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.

రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : మండలంలోని MPUPS కొత్తపల్లి పాఠశాలలో దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు బుదవారం ప్రారంభమయ్యాయి. 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి రూ.1,50,000 వ్యయంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ దాతలు ఊడెం విజయ, మహిపాల్ రెడ్డి ల సహకారం అందించారు.

అలాగే పాఠశాల స్వాగత తోరణాన్ని రూ.40,000 వ్యయంతో ఎక్కాల లక్ష్మణ్ (AE),మన్నె యాదగిరి,మహేష్ లు నిర్మించి ప్రారంభించారు. పాఠశాలకు త్రాగునీటి సరఫరా, డ్రైనేజ్ సదుపాయాలను రూ.20,000 వ్యయంతో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఎక్కాల శ్యామల మల్లేశం ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎక్కాల శ్యామల,ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి, ZPHS రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, AAPC చైర్మన్ రాధ, SDC చైర్మన్ నరేష్, గ్రామ కార్యదర్శి పరమేశ్వర్,వార్డు సభ్యులు,నాయకులు అంజనేయులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.