ఆర్టిజన్స్ అనుమ్యాన్ సమ్మెలో పాల్గొన్న విద్యుత్ కార్మికులు…

ఆర్టిజన్స్ అనుమ్యాన్ సమ్మెలో పాల్గొన్న విద్యుత్ కార్మికులు…
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తమ సమస్యల ను పరిష్కరించాలని కోరుతూ ఆర్టిజన్స్ అనుమ్యాన్ సమ్మె లో తొర్రూర్ విద్యుత్ కార్మికు లు పాల్గొన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయిం ట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సమ్మెలో తొర్రూర్ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఒకే రూల్ ఒకే వ్యవస్థ అమలు చేయాలని ఆర్టిజన్ కార్మికులందరినీ కన్వర్షన్ ఏపీఎస్ఈబి రూల్స్ వర్తింపజేయాలని, అన్మాడ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, స్పాట్ బిల్లర్స్ ఫీజు, రీడ్ కార్మికులు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఇటు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం నుంచి నిరవదిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ మచ్చ సతీష్, డివిజన్ చైర్మన్ పసుపులేటి మధు, కన్వీనర్ బందార శ్రీను, కో చైర్మన్ నాగరాజు, కో కన్వీనర్ రమేష్, ప్రకాష్, ఖాజాబీ, జ్యోతి, స్వప్న, ఉపేందర్, సునీల్,శతర్ పాషా హరిప్రసాద్, బంధు శ్రీను రామకృష్ణ ,సందీప్ ,అశోక్ పుల్లయ్య ,మధు, సుదర్శన్ వివిధ సెక్షన్ల నుంచి ఆర్టిజన్స్ అనుమ్యాన్ కార్మికులు పాల్గొన్నారు
