సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ…

సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ…
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని హాసకోత్తుర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు మంగళవారం పంపిణీ చేసినట్లు సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాపర్తి నవ్య కు రూ. 58,000,రాధారపు చిన్న సాయన్నకు రూ. 38,000, పడాల సత్యనారాయణ కు రూ. 13,000, నలిమేలా పెద్ద గంగాధర్ కు రూ. 9500,ఎర్ర కిష్టయ్య కు రూ. 9500 ల చెక్కులను లబ్ధి దారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు కష్టకాలంలో సహాయ, సహకారాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, పాలకవర్గ సభ్యులు కనక నర్సయ్య, పెద్ది సృజన్, కుందేటి శ్రీనివాస్ రాధరాపు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల శ్రీకాంత్, గోపిడీ లింగారెడ్డి, మోదిని శ్రీధర్, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
