గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చూడండి…

గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చూడండి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాల్లో వేసవి కాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి పరిష్కరించాలని ఊట్కూర్ ఎంపీడీవో కొండన్న అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి ఇంటి టాక్స్ లు వసూలు చేయాలనిఅన్నారు.

వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. నర్సరీలో మొక్కలు ఏపుగా పెరిగే విధంగా చూస్తూ ఉపాధి హామీ పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే వివిధ పనులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు నిబంధనల ప్రకారం వసతులు కల్పిస్తూ నర్సరీల్లో చలువ పందిర్లు వేయాలనిఅన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం పకడ్బందీగా చేపడుతూ ఆయా గ్రామాల్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎం పి ఓ బాలాజీ, ఉపాధి హామీ ఎపిఓ లక్ష్మీరెడ్డి, ఈసీ మహిపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply