ఉప్లూర్‌లో పశు వైద్య శిభిరం ప్రారంభం…

ఉప్లూర్‌లో పశు వైద్య శిభిరం ప్రారంభం…
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో మంగళవారం పశు వైద్య కళాశాల కోరుట్ల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని డా.యమ్.శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ పాడి రైతులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డా.మల్లేష్ పశువులకు పేడ పరీక్షలు,రక్త పరీక్షలు నిర్వహించి, తద్వారా పశువులకు వ్యాపించిన వ్యాధులను గుర్తించి తగిన చికిత్స నిర్వహించారు.
అలాగే డా. గోపాలకృష్ణ,డా. విశాల్ ( గైనకాలజి ప్రొఫెసర్లు ) గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, గర్భ సమస్యల గురించి విశదీకరంగా వివరించి పలు సూచనలు ఇచ్చి తగిన చికిత్సలను నిర్వహించారు. గొర్రెలు, మేకలకు అనారోగ్య సమస్యల గురించి డా. శ్రీకాంత్ ( మెడిసిన్ ప్రొఫెసర్ ) పరిశీలించి తగు చికిత్స లను నిర్వహించారు. 14 ఆవులు, 79 బర్రెలు, 119 గొర్రెలు, 46 మేకలు, 9 కుక్కలకు చికిత్స నిర్వహించారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ పశువులకు గర్భకోశ వ్యాధుల గురించి తగిన సూచించారు.

కోరుట్ల పశు వైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి శిబిరం వివరాలు తెలుసుకొని రైతులకు, విద్యార్థులకు తగిన సలహాలు ఇచ్చి తగు సూచనలు చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ నాగరాజు ప్రొఫెసర్లు పాల్గొని రైతులకు, విద్యార్థులకు తమ అమూల్యమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది. డా.వసంత్( చౌటుపల్లి వెటర్నరీ డాక్టర్ ),ప్రవీణ్ రెడ్డి యల్.యస్.ఎ,స్పరన్ గోపాలమిత్ర పాడి రైతులు, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, వార్డు సభ్యులు అజయ్, సంతోష్ ,సతీష్, శేఖర్, పశు వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
