ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే మద్దతు ధర : డీఆర్ డీఎపీడీ

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, అక్కడే మద్దతు ధర పొందవచ్చని డిఆర్ డిఎ పిడి శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తొరగల్, మేళ్లదుప్పలపల్లి, కొత్తపల్లి, అప్పాజీపేట, నర్సింగ్ భట్ల, కుదావన్ పూర్, చిన్న సూరారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్థానిక ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక సర్పంచ్ లు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్లో దాదాపు 400 పైచిలుకు కేంద్రాలను ఏర్పాటు చేశామని కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులో పంపించేందుకు వీలుగా 125 మిల్లులను లింక్ చేశామన్నారు. రైతులు ధాన్యాన్ని తూర్పారబట్టి తాలు లేకుండా తీసుకొస్తే మద్దతు ధర 2389 పొందవచ్చన్నారు. తూర్పార బట్టే యంత్రాలను సైతం ఆయా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
40 కిలోల 700 గ్రాములు మాత్రమే తూకం వేయాలని, అంతకంటే ఎక్కువ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాకూబ్ నాయక్, ఏవో సుంకోజు శ్రీనివాస్, ఎపియం వినోద, ఎపివో స్ఫూర్తి, సర్పంచులు జిల్లపల్లి రేణుక స్వామి , గంగుల అండాలు సైదులు, జకీరా తాజొద్ధీన్ తదితరులు, సిసిలు గీత, శంకర్, రమేష్, శారద, ఎంఎస్ అధ్యక్షురాలు పుష్పలత, ఈసి అనిత, టిఎ సోమయ్య, ఎఈవో దేవేందర్, వివోఎలు యాదమ్మ, పి.కవిత, కె.కవిత, అనురాధ, నర్మద, సంధ్య, కళ్యాణి, రైతులు , నాయకులు రాపర్తి సతీష్, యాదగిరి రెడ్డి, వెంకట్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, సైదులు, వెంకన్న, యాదయ్య , స్వామి తదితరులు పాల్గొన్నారు.
