7thAprileditorial | ట్రంప్ హెచ్చరికల పై ఇరాన్ తీవ్ర స్పందన..

7thAprileditorial | ట్రంప్ హెచ్చరికల పై ఇరాన్ తీవ్ర స్పందన..
7thAprileditorial | హార్మూజ్ జలసంధి తెరవాలని అమెరికా డిమాండ్
బుషెహర్ అణు కేంద్రంపై దాడిపై IAEA ఆందోళన
హదీద్-110 స్టెల్త్ డ్రోన్‌ను బయటపెట్టిన ఇరాన్
పవర్ ప్లాంట్లపై దాడుల హెచ్చరికతో ఉద్రిక్త పరిస్థితి
7thAprileditorial | హార్మూజ్ జలసంధిని తెరవాలని డిమాండ్ చేస్తూ అమెరికా ఇరాన్‌కు కొత్తగా పంపిన ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలను పరిశీలించకపోతే ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఖాతరు చేయడం లేదు. అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేస్తూనే, తమ దేశంలోని మౌలిక సదుపాయాలను పేల్చేస్తామన్న అమెరికా హెచ్చరిక యుద్ధ నేరం అని ఇరాన్ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. “మీరు నరకాన్ని చూడటానికి ఇంకా రెండు రోజులే గడువు” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.

శనివారం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికన్ సైనికులు జరిపిన దాడిపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చర్యను వెంటనే ఖండించకపోవడంపై ఇరాన్ నిరసన వ్యక్తం చేయడంతో సోమవారం ఆ సంస్థ అధికారికంగా స్పందించింది. అమెరికాతో చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే తమ దేశం విధించిన షరతులకు లోబడి చర్చలు జరిగితేనే అంగీకరిస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ స్పష్టం చేశారు. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థతో అమెరికా విమానాలను కూల్చివేశామని, యుద్ధంలో ఇలాంటివి సహజమేనని ఇరాన్ పేర్కొంది.
తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఇరాన్ “హదీద్-110” పేరుతో స్టెల్త్ సెక్ డ్రోన్ను బయటపెట్టింది. ప్రత్యర్థి రాకెట్లకు చిక్కకుండా వేగంగా దూసుకెళ్లే ఈ డ్రోన్ ఇప్పటికే వినియోగంలో ఉందని తెలిపింది. ఈ డ్రోన్ సూసైడ్ డ్రోన్ తరహాలో పని చేసి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత స్వయంగా పేల్చుకుని విధ్వంసం సృష్టిస్తుంది. ఇరాన్ ఈ డ్రోన్‌ను ప్రయోగించడంతో అమెరికా మరింత శక్తివంతమైన డ్రోన్లను వినియోగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనలను ట్రంప్ ఇప్పటివరకు చేయలేదని, హార్మూజ్ జలసంధిని తెరిస్తేనే ఇరాన్‌తో చర్చలు జరుపుతామని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు.
మంగళవారం ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, ముఖ్యమైన వంతెనలను పేల్చేస్తామని ట్రంప్ తాజా హెచ్చరికలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశముండటంతో ఇరాన్ కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇరాన్‌పై అమెరికన్ దళాలు జరిపిన దాడుల్లో సోమవారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి మరణించగా, మరికొంత మంది సభ్యులు కూడా మృతి చెందినట్లు సమాచారం.
