రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం…

రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం…

విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు…
15 ఏళ్ల విద్యార్థుల సేవకు దక్కిన రాష్ట్రస్థాయి గౌరవం

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ సాంస్కృతిక వేదిక రవీంద్రభారతిలో ఆదివారం వేడుకగా నిర్వహించిన పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో విద్యాభివృద్ధి, సమాజ సేవలో విశేష కృషి చేసి, దళితుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తున్న కోటపాటి రుక్మారావు కి ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వ దళితరత్న పురస్కారం లభించింది.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చైర్మన్ గా ఉన్న మహనీయుల జయంతోత్సవ కమిటీ పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సి.శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న పురస్కార ప్రధాన ఉత్సవంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ కో కన్వీనర్ దొమ్మాటి సుదర్శన్ బాబు చేతుల మీదుగా రుక్మారావు దళితరత్న పురస్కారాన్ని అందుకున్నారు. కోటపాటి రుక్మారావు గత 15 సంవత్సరాలుగా దళితుల విద్యా అభివృద్ధి, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, సామాజిక అవగాహన కార్యక్రమాలు, యువతకు మార్గనిర్దేశకులుగా కృషి చేస్తున్నందుకు గాను ఈ దళితరత్న పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా దళితరత్న పురస్కారం అందుకున్న కోటపాటి రుక్మారావు మాట్లాడుతూ ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, సమాజ సేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతానని, సమ సమాజ స్థాపన కోసం తన వంతుగా కృషి చేస్తానని, పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో సామాజిక సేవకు అంకితం అవుతానని, విద్యాభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. దళితరత్న పురస్కారం అందుకున్న కోటపాటి రుక్మారావును షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, జాయింట్ డైరెక్టర్ బి..శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీనివాస రావు, సూపర్నెంట్స్ అలీముద్దీన్, బాలసానిరెడ్డి, ఏ ఎస్ సి డి ఓ మోహన్, కళ్యాణ్, అల్లిబిల్లి మహేందర్, ఉత్సవ కమిటీ బాధ్యులు జి.చెన్నయ్య, కరెన్సీ పై బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రణ కమిటీ అధ్యక్షులు జెర్రిపోతుల పరుశురామ్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

దళితరత్న అవార్డు అందుకున్న రుక్మారావును ఖమ్మం ఎన్ ఎస్ సి కాలనీ ఎస్సీ బి బాలుర వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు, హెచ్ డబ్ల్యు ఓలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ జిల్లా నాయకులు, టీఎన్జీవోస్ నాయకులు, టీజీవోస్ నాయకులు పలు ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రజాసంఘాల నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply