Breast cancer | భారత్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ పరిస్థితి మరియు గణాంకాలు..

Breast cancer | భారత్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ పరిస్థితి మరియు గణాంకాలు..
Breast cancer | వయసు పెరిగేకొద్దీ స్తన కణజాలంలో మార్పులు
మెనోపాజ్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది
శాస్త్రవేత్తల అధ్యయనం ఏమి చెబుతోంది
భవిష్యత్తులో స్క్రీనింగ్ మరియు నివారణకు కొత్త మార్గాలు
వయసుతోపాటు పెరుగుతున్న బ్రెస్ట్‌క్యాన్సర్ ముప్పు
Breast cancer | మహిళల్లో వచ్చే క్యాన్సర్‌లలో ఎక్కువ కేసులు బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించినవే. ప్రత్యేకించి భారత్‌లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. మనదేశంలో మహిళలల్లో వస్తున్న క్యాన్సర్‌లలో 23 నుంచి 322 శాతం కేసులు ఇవే. 2022 గణాంకాల ప్రకారం ఏడాదికి, సగటున 1.9 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అవగాహన లోపం, రోగాన్ని ముందుగా గుర్తించకలేకపోవడం ప్రధాన కారణాలు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై జరిగే పరిశోధనలు ముమ్మరమవుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రహిత ప్రపంచం కోసం శాస్త్రవేత్తలు, వైద్యులు నిరంతరం పని చేస్తున్నారు. అందులో భాగంగా అధ్యయనాలు చేస్తున్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, మహిళల వయసు పెరిగేకొద్దీ వారి స్తన కణజాలంలో గణనీయమైన మార్పులు జరుగుతాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన మహిళలకు ఈ ముప్పు ఎక్కువ.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ అధ్యయనంలో కోథర్‌గా బాధ్యతలు నిర్వహించిన శాస్త్రవేత్త పులకిత్ గుప్తా ఈ అధ్యయనం వివరాలను వెల్లడించారు. పరిశోధకులు.. 15-86 వయసుకు చెందిన 500 మంది మహిళల నుంచి 3 మిలియన్ కంటే ఎక్కువ స్తన కణాలను సేకరించి విశ్లేషించారు. వయసు పెరిగేకొద్దీ మహిళల స్తన కణజాలంలోని అన్ని రకాల కణాల సంఖ్య తగ్గుతుందని, పైగా అవి తక్కువగా విభజన చెందుతాయని గుర్తించారు. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఈ మార్పులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని గుర్తించారు. స్తన కణజాలంలో పాలు ఉత్పత్తి చేసే లాబ్యూల్స్ కుంచించుకుపోవడం లేదా అదృశ్యమవుతాయి. అదే సమయంలో పాలు రవాణా చేసే డక్ట్స్ సాపేక్షంగా ఎక్కువగా కనిపిస్తాయి. వాటి చుట్టూ ఉండే సపోర్టింగ్ లేయర్ మందంగా మారుతుంది. కొవ్వు కణాలు పెరుగుతాయి. రక్తనాళాలు, ఇతర వ్యవస్థలూ మార్పులు చెందుతాయి. (రోగనిరోధక కణాలు) సంఖ్య తగ్గి, వాటి పని తీరు బలహీనపడుతుంది. (వాపు కలిగించే కణాలు) ఎక్కువవుతాయి.
ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడవు. ఈ మార్పులు కలిసి ఒక మైక్రో-ఎన్విరాన్మెంట్ (స్థానిక వాతావరణం)ను సృష్టిస్తాయి. ఇందులో సహజంగా ఏర్పడే క్యాన్సర్ కణాలు సులభంగా వృద్ధి చెంది వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల వయసు పెరిగినప్పుడు కణాల సంఖ్య తగ్గడం వల్ల, ఏదైనా అసాధారణ కణం సులభంగా ఆధిపత్యం చెలాయించవచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడటం వల్ల శరీరం ప్రారంభ క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేయడం కష్టమవుతుంది. ఈ మార్పులు 50 సంవత్సరాలు పైబడిన మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఎందుకు వస్తుందో వివరిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం భవిష్యత్తులో మెరుగైన స్క్రనింగ్, ప్రివెన్షన్ మరియు ట్రీట్మెంట్ విధానాలకు సహాయపడుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో జరిగే మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా క్యాన్సర్ రిస్క్‌ను ముందుగానే అంచనా వేయవచ్చు.

