108లో ప్రసూతి అయిన మహిళ

108లో ప్రసూతి అయిన మహిళ
తల్లీ బిడ్డ క్షేమం
సిర్పూర్ (యు) /లింగాపూర్, ఆంధ్రప్రభ : ఆదివాసి గిరిజన గర్భిణీ మహిళను ప్రసూతి కోసం 108 వాహనంలో శనివారం తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికంగా కావడంతో 108 వాహనంలోని ప్రసూతి చేశామని 108 ఈఎంటి సిహెచ్ రవి పైలట్ దయాకర్ తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని చిన్న దాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి గర్భిణి మహిళ కుమ్ర సంగీత కు పురిటి నొప్పులు రావడంతో బంధువుల సమాచారం మేరకు ఆమెకు ప్రసిద్ధి కోసం తరలిస్తుండగామార్గమధ్యంలోనే ప్రసూతి అయిందని ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వారు తెలిపారు.
తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వారికి చికిత్స నిమిత్తం సిర్పూర్ (యు) ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని వారు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో అమ్మాయిలకు ప్రసూతి చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా కృషిచేసిన ఈఎంటి పైలెట్లకు సంగీత బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
